ScrollNew
Latest Short Films, Short Film Reviews,Cast and Crew Interviews

కథలు ఎన్నో రకాల భావోద్వేగాల సమ్మేళనం-డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్||ShortFilms

డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్ || ScrollNew Interviews

కథలు ఎన్నో రకాల భావోద్వేగాల సమ్మేళనం. నవరసాలలో ఒక్కొక్కరికి ఒక్కో రసం ఇష్టం – డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్ || ScrollNew Interviews

డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్ తీసింది రెండు షార్ట్ ఫిల్మ్స్ యే కానీ ఒక 10  షార్ట్ ఫిల్మ్స్ అంత పేరు వచ్చింది.పేరుతో పాటు అవార్డ్స్ ను కూడా తీసుకొచ్చింది.ఆ ఫలితం వెనక ప్రయత్నం గురించి ఇపుడు తెలుసుకుందాం!

Q) మీ గురించి మీ ఫ్యామిలి గురించి ?
నా పూర్తి పేరు డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్. డాక్టర్ ని అయీనా, సినిమాలంటే ప్రాణం. మాది మధ్య తరగతి కుటుంబం. గిరిజన తండాలో పుట్టి పెరిగాను అమ్మ సుజాత,నాన్న చిన గోపాల్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గరలో ని అడవిదేవులపల్లి మా సొంత వూరు. నా భార్య పేరు డా.పూర్ణిమ .నాకు ఇద్దరు పిల్లలు ఆయుష్ కుమార్,అంజన ధ్రుతి.

Q) మీకు ఈ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ?
దాదాపు కొన్ని వేల చిత్రాలు చూసాను.ప్రతి చిత్రం చూస్తున్నప్పుడే ఆ చిత్రం లోని ప్లస్ పాయింట్స్,మైనస్ పాయింట్స్ రాసుకునే వాడ్ని.

Q) మీకు మొట్ట మొదటి సారి అవకాశం ఎలా వచ్చింది ?
నాకు మొట్ట మొదటి సారి అవకాశం ఇచ్చింది ప్రొడ్యూసర్ యన్.యస్.నాయక్. ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ వుంటారు. ఆయన మరియు ఆయన తమ్ముడు మహేశ్ సహాయ సహ కారాలు మరచిపోలేనివి. అలాగే నా మిత్రులు హరి కాసుల,సుధీర్ రెడ్డి,నరేశ్, అనుపమ రెడ్డి గారు,హనుమంతు నాయక్ గారు నన్ను ఎంత గానో ప్రొత్సహించారు.
Q) మీరు చేసిన రెండు షార్ట్ ఫిలిమ్స్ లో సమాజానికి Message Oriented యే చేశారు కదా! డిఫ్ఫెరెంట్ జానర్స్ లో ఎప్పుడు చేస్తారు ?
నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన పరిస్థితులు నన్ను సామాజిక చిత్రాల వైపుకు నడిపించాయి. నా మొదటి లఘు చిత్రం ప్రజా హక్కు గాని,నా రెండవ లఘు చిత్రం అంటురానితనం రెండూ కూడా సామాజిక సమస్యలు మూల కథాంశంగా చేసినవే. త్వరలోనే ఒక లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తాను.కానీ అందులో కూడా ఏదో ఒక సామాజిక అంశం అంతర్లీనంగా వుంటుంది
Q) ప్రజా హక్కు మంచి చైతన్య వంతమైన షార్ట్ ఫిల్మ్ గా చిత్రపురి అవార్డ్స్ లో ప్రైజ్ కొట్టేసింది ఫస్ట్ ఫిల్మ్ కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని Expect చేశారా ?
ప్రజా హక్కు కథ అనుకున్నపుడే దీనికి ఖచ్చితంగా అవార్డ్ వస్తుందని వూహించాను. ఇక చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో అవంతిక,జై పర్ఫార్మెన్స్ చూసి ఇక 100 పర్సెంట్ గ్యారంటీ అని నేను మా నిర్మాత యన్.యస్.నాయక్ గారు ఫిక్స్ అయ్యాము.

చైతన్య వంతమైన షార్ట్ ఫిల్మ్ గా చిత్రపురి అవార్డ్స్ లో డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్
చైతన్య వంతమైన షార్ట్ ఫిల్మ్ గా చిత్రపురి అవార్డ్స్ లో డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్

దిల్ రాజు గారి చేతుల మీదుగా రవీంధ్ర భార్రతిలో చిత్రపురి ఫిల్మోత్సవ్ లో అవార్డ్ తీసుకోవడం మరచిపోలేని సంఘటన. ఆ అవార్డ్ జ్యూరీకి ముఖ్యంగా కార్తీక్ సుంకరి గారికి ధన్య వాదాలు
Q) మీరు చేసిన 2 ఫిలిమ్స్ కి అవార్డ్స్ వచ్చాయి కదా!  దాని వెనక ఉన్న శ్రమ గురించి చెప్తారా ?
శ్రమ అనేది చాలా వుంది.నేను మూల కథ చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఆలోచిస్తాను.అంత త్వరగా నాకు నేను కన్విన్స్ అవ్వను. ఒకసారి నేను రాసుకున్న కథ బాగా నచ్చిన తరువాత, నా టీం కి ముఖ్యంగా నా అసిస్టంట్ రైటర్స్ శ్రీకాంత్,ప్రత్యూష్ కి చెబుతాను.నేను రాసుకున్న ,అనుకున్న కథ వారిని కూడా ఉత్తేజానికి గురి చేస్తుంది.
వారు ,నేను కలిసి ఫైనల్ గా ఒక సూపర్బ్ అవుట్ పుట్ ని తీసుకొస్తాము.

కథలు ఎన్నో రకాల భావోద్వేగాల సమ్మేళనం. నవరసాలలో ఒక్కొక్కరికి ఒక్కో రసం ఇష్టం - డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్ || ScrollNew Interviews
కథలు ఎన్నో రకాల భావోద్వేగాల సమ్మేళనం. నవరసాలలో ఒక్కొక్కరికి ఒక్కో రసం ఇష్టం – డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్ || ScrollNew Interviews

Q) ఈ మధ్య అందరూ లవ్ స్టోరీస్ Choose చేసుకుంటున్నారు దాని పై మీ ఒపీనియన్ ?
కథలు ఎన్నో రకాల భావోద్వేగాల సమ్మేళనం. నవరసాలలో ఒక్కొక్కరికి ఒక్కో రసం ఇష్టం. ప్రేమ కథలు,స్పూఫ్ లు,హర్రర్ ఇలా చాలా మంది షార్ట్ ఫిలింస్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు.కానీ కొన్ని వీడియోస్ సిల్లీగా వుంటున్నాయి.కొన్ని అమెచ్యూర్ గా వుంటునాయి.కొన్ని అద్భుతంగా వుంటున్నాయి. నా వరకు మాత్రం మంచి క్వాలిటీతో మనసుకు హత్తుకునే చిత్రాలను చేయాలన్నదే నా లక్ష్యం.
Q) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
రెండు ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ ఫినిష్ అయ్యాయి.మంచి ప్రొడక్షన్ టీం కోసం చూస్తున్నాను. అలాగే ఒక మ్యూజిక్ వీడియో,2 షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ రెడీగా వున్నాయి.త్వరలోనే మిగతా వివరాలు తెలియ చేస్తాను.

Q) మన దగ్గర లేడీస్ రొల్స్ కు కొరత ఉంది అంటారా ?
ఒకప్పుడు వుండేది…ఇప్పుడు మెలమెళ్ళగా తెలుగు అమ్మాయిలు నటించడానికి ముందుకు వస్తున్నారు
Q) మీ ఇన్స్పిరేషన్ ? 
నాకు తమిళ డైరెక్టర్ శంకర్ గారు,తెలుగులో రాజమౌళి ,రాం గోపాల్ వర్మ గారు ఇన్ స్పిరేషన్
Q) అంటురానితనం షార్ట్ ఫిల్మ్ గురించి..
అంటురానితనం నా మనసుకు దగ్గరగా వున్న కథ…ఆ చిత్రాన్ని అమెరికాలోని నాటా వారు మరియు సాహా వారు ప్రత్యేక ప్రదర్షణ చేసారు…అలాగే ఎంతో మంది సినీ ప్రముఖులు ,మీడియా వారు మెచ్చుకోవడం మరచిపోలేని అనుభూతి.

అంటురానితనం నా మనసుకు దగ్గరగా వున్న కథ... డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్
అంటురానితనం నా మనసుకు దగ్గరగా వున్న కథ… డా.ఆనంద్ కుమార్ ఇస్లావత్

ముఖ్యంగా నాలోని ప్రతిభను చూసి మెగా స్టార్ చిరంజీవి గారు, స్వర్గీయ దాసరి నారాయణ రావు గారు, మైత్రి మూవీస్ రవి శంకర్ గారు,శ్రీదేవి మూవీస్ శివలెంక క్రిష్న ప్రసాద్ గారు, రాజ్ కందుకూరి గారు, బి.గోపాల్ గారు,తమ్మారెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది.వారందరికి ధన్య వాదాలు.
Q) ఎక్కువ ఫిలిమ్స్ చేయకపోయినా కూడా మీకు చాలా బాగా గుర్తింపు వచ్చింది ఎంతో మంది దర్శకులు ఎన్నో ఫిలిమ్స్ చేసి ఇంకా ఆ పాపులారిటీ లో వెనకే ఉన్నారు ఇది మీకు ఎలా పాసిబుల్ అయింది ?
నేను ఎంచుకున్న కథలే నా బలం. దానికి నేను ప్రెజెంట్ చేసిన విధానం,మంచి విజువల్స్ తో హై క్వాలిటీతో చేయడం ,రొటీన్ కి భిన్నంగా వుండడం,కథలోని నిజాయితీ, నాలోని ఆత్మ విశ్వాసం, నాలో ఎదుటి వారిని ఆకట్టుకో గలిగే స్వభావం,నా మాటల్లో నిజాయితీ,చేతల్లో హార్డ్ వర్క్ డెడికేషన్ నన్ను మిగతా వారందరి కంటే ముందు వరసలో వుంచాయని నా నమ్మకం. అన్నిటి కంటే నా సబ్జెక్ట్ సెలెక్షన్ ,దర్షకత్వ ప్రతిభ నాకు ,ఎన్నో చిత్రాలు చేసిన వారికన్నా మంచి పేరును తీసుకొచ్చాయి.

 ప్రజాహక్కు లఘు చిత్రం గూర్చి దాసరి నారాయణ రావు

డైరెక్టర్ బి గోపాల్ మాటలు ప్రజా హక్కు షార్ట్ ఫిలిం గురించి

తమ్మారెడ్డి భరద్వాజ్ గారి మాటలు ప్రజా హక్కు షార్ట్ ఫిలిం గురించి

ప్రజాహక్కు లఘు చిత్రంపై పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి

Q) కొత్త వాళ్ళకి ఈ ఫీల్డ్ లోకి రావాలి అంటే ముందుగా ఉండాల్సిన క్వాలిటీ ఏమంటారు ?
డెడికేషన్ ,హార్డ్ వర్క్,నిజాయితీగా, నమ్మకంగా పని చేయడం

Q) ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది బయట నుండి బాగా సపోర్ట్ చేసేవాలు ఎవరైనా ఉన్నారా ?
నా భార్య డా.పూర్ణిమ , నా అంకుల్ యన్.యస్ నాయక్ గారు ప్రోత్సాహం యెన్నటికీ మరువ లేనిది

సింగర్ మాళవిక మాటలు ప్రజా హక్కు షార్ట్ ఫిలిం గురించి

బ్రహ్మోత్సవం ఫేమ్ అవంతిక ప్రజా హక్కు షార్ట్ ఫిలిం గురించి

హీరో అభిజీత్ ప్రజా హక్కు షార్ట్ ఫిలిం గురించి | అవంతికా

Praja Hakku | A Short Film Shows the Life of Children Working in Brick Factories
Q) అవంతిక వదనపు, హాసిని అవని, సంధ్య జనక్ లతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా ?
అవంతిక వదనపు- ఒక అత్యద్భుతమైన నటి.రాబోయే రోజుళ్ళో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక సావిత్రమ్మ, ఒక సౌందర్య అవంతిక రూపంలో రాబోతుంది. హాసిని-మంచి ప్రతిభ కలిగిన బాల నటి.చాలా టాలెంట్ వున్న అమ్మాయి. ఇక సంధ్యా జనక్ గారి గురించి చెప్పే వయసు అనుభవం నాకు లేవు..ఆవిడ ప్రూవెన్ ఆర్టిస్ట్.
Q) ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్ లో అన్ని కాటగిరిస్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అపుడు ఎలా అనిపించింది ?
చాలా సంతోషంగా వుంది…ఉదయ్ కిరణ్ గారి జ్య్నాపకార్థం జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో ప్రజా హక్కు 6 కేట గిరీలలో ఎన్నికవడం ఆ చిత్రానికి ,మా టీం కి దక్కిన గౌరవం గా భావిస్తున్నాను.

Q) సక్సెస్ అయినపుడు మీ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ?
చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా సామాజిక అంశాలతో నేను చేస్తున్న చిత్రాలు ప్రతి ఒక్కరి హ్రుదయాన్ని తాకుతున్నయి…ఆలోచింప చేస్తున్నాయి. మరిన్ని అద్భుతమైన కథలను సిద్దం చేయడానికి ప్రోత్సాహాన్నిస్తున్నాయి.
Q) మీ ఫ్యూచర్ గోల్స్ ?
మంచి మంచి మనసుకు హత్తుకునే,కొత్త రకమైన మూల కథమాలతో, కథలతో చిత్రాలు చేసి అందరి మన్నలను పొంది, సినిమా ఫీల్డ్ లో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా నిలబడి, పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలన్నదే నా లక్ష్యం.

ఇదండీ ఆనంద్ కుమార్ గారి Interview. ఆనంద్ గారు తన ఆశయాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Also read Interview With Kabir Rafi

Note:

Short film industry loni anni vishayalanu mariyu, andarini  feature cheyyali annadi maa aim. Miku telisina films kani, cast and crew ni gani [email protected] ki mail cheyyandi leda maa FB page lo message pettandi.

 

Get real time updates directly on you device, subscribe now.

 Hacklink hacklink Hacklink Hacklink Hacklink hacklink google Asakir php shell indir escort bayan sakarya escort sakarya escort sakarya escort sakarya escort sakarya escort sakarya escort bayan sakarya escort bayan sakarya escort bayan sakarya escort bayan sakarya escort bayan webmaster forum sakarya avukat eşşek pornosu hayvan pornosu animal porn zonguldak escortتجميل الأنف في تركياpromosyon plastik kalemerotik film instagram takipçi hilesirus merhemiTakipçi satın al istanbul nakliyat jasminbet evden eve nakliyat instagram Takipçi hilesiافضل شركات التداولbahis siteleri güncel giriş adresleribahis siteleri güncel adreslericanlı bahis siteleriliposuction turkey muş escort